2020-09-17 07:56:54
సాయం కోసం భిక్షాటన చేసిన ప్రముఖ నటుడు శంకర్!!
తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన ప్రముఖ నటుడు శంకర్… తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా… మిగిలిన డబ్బులు తను జోడించి… మొత్తం లక్ష రూపాయలతో… కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి… అందుకు తనకు సహకరించిన కరీంనగర్ ‘విందు భోజనం’ మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బిటిఆర్ లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వేడుకుంటున్నానని శంకర్ పేర్కొన్నారు!!
