2020-09-17 08:06:39
అక్టోబర్ లో ‘ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ!!
కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్న రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న తరుణంలో జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు చరణ్. ఇప్పటికే వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన టీజర్ లో మజిల్డ్ బాడీతో కనిపించారు. లాక్ డౌన్ లో ఫిట్నెస్ మైంటైన్ చేశారు. మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి సేమ్ మజిల్డ్ బాడీ షేప్ లోకి రావాలని ఫిక్స్ అయ్యారట. అందుకే యమా కసరత్తులు చేస్తున్నారట
అక్టోబర్ మొదటి వారం నుండి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ప్రారంభమవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. రాజమౌళి మాత్రం అక్టోబర్ నెలాఖరు నుండి ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారట. విజయ దశమి తరవాత సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.