2020-09-17 13:19:37
ఎన్టీఆర్ సినిమాకు 250 కోట్లు !!
సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లు రావడం చాలా సులభమని ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాలు నిరూపించాయి. ఉత్తరాది ప్రేక్షకులు సైతం దక్షిణాది సినిమాలను చూస్తారు అని చాటి చెప్పాయి. అందుకని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందట. ఇంటర్ నేషనల్ లెవెల్ లో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. అది పాన్ ఇండియా ఫిలిం. మరో వైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘కేజిఎఫ్ 2’ కూడా పాన్ ఇండియా ఫిలిం. ఆ రెండు సినిమాలతో తర్వాత ఇద్దరి మార్కెట్ మరింత పెరుగుతుందనీ, 250 కోట్ల రూపాయల వసూళ్లు రావడం పెద్ద కష్టమేమి కాదని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోందట. ఆల్రెడీ స్టోరీలైన్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ పాత్రను అదిరిపోయేలా డిజైన్ చేశాడని తెలుస్తోంది.